చంద్రబాబు ఇచ్చే హామీని బట్టి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది: టీడీపీ కాపు నేత బొండా ఉమ

  • కాసేపట్లో బొండా ఉమ ఇంట్లో భేటీ అవుతున్న టీడీపీ కాపు నేతలు
  • సాయంత్రం చంద్రబాబుతో భేటీ
  • బీజేపీలోకి వెళ్లే వారితో తమకు సంబంధం లేదన్న బొండా ఉమ
టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీలోని కాపు నేతలు ఇటీవల సమావేశం కావడం రాజకీయంగా దుమారం రేపింది. అయితే, పార్టీ ఓటమిపైనే తాము చర్చించామని కొందరు నేతలు క్లారిటీ ఇచ్చారు.

ఈ సాయంత్రం కాపు నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో, కాసేపట్లో కాపు నేతలు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ నివాసంలో లంచ్ మీటింగ్ కు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసిన కాపు అభ్యర్థులకు పార్టీ నుంచి సరైన సహకారం అందలేదని చెప్పారు. బీజేపీలోకి వెళ్లే వారితో తమకు సంబంధం లేదని అన్నారు. పార్టీ మార్పు గురించి సమావేశంలో చర్చించబోమని తెలిపారు. అయితే, వాస్తవ పరిస్థితులను చంద్రబాబుకు వివరిస్తామని... ఆయన ఇచ్చే హామీని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
bonda uma
Telugudesam
kapu
leaders
meeting

More Telugu News